వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సంచలన రికార్డు

by GSrikanth |
వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సంచలన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు. ఇంతరవరకు ప్రపంచంలో ఏ కెప్టెన్ అందుకోని ఘనత సాధించాడు. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఒక వ‌న్డే ప్రపంచ‌క‌ప్ టోర్నమెంట్‌లో అత్యధిక ప‌రుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలిమ‌య్సన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. విలిమ‌య్సన్ 578 ప‌రుగులు చేయ‌గా.. ఫైన‌ల్ మ్యాచ్‌లో రోహిత్ 29 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద బ్రేక్ చేశాడు. వీరిద్దరి త‌రువాతి స్థానాల్లో జ‌య‌వ‌ర్థనే, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.

ఒక ప్రపంచ‌క‌ప్‌లో టోర్నమెంట్‌లో అత్యధిక ప‌రుగులు చేసిన కెప్టెన్లు వీరే..

రోహిత్ శర్మ (భార‌త్)- 11 ఇన్నింగ్స్‌ – 597 ప‌రుగులు – 2023

కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్‌)- 10 ఇన్నింగ్స్‌ – 578 ప‌రుగులు – 2019

మహేల జయవర్ధనే (శ్రీలంక‌)- 11 ఇన్నింగ్స్‌ – 548 ప‌రుగులు – 2007

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 11 ఇన్నింగ్స్‌ – 539 ప‌రుగులు – 2007

ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 10 ఇన్నింగ్స్‌ – 507 ప‌రుగులు – 2019

Advertisement

Next Story