ICC World Cup 2023: 'సిక్సర్లు మాత్రమే మన ఫేవరెట్'

by Vinod kumar |
ICC World Cup 2023: సిక్సర్లు మాత్రమే మన ఫేవరెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మెరుపు సెంచరీ (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ సెంచరీతో హిట్‌మ్యాన్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు.. విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్‌ నిన్నటి మ్యాచ్‌లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్‌ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్‌ ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్‌ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్‌ థ్యాంక్స్‌ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్‌ మాత్రం 6 అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా, రోహిత్‌, క్రిస్‌ గేల్‌లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed