టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన BCCI

by GSrikanth |
టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్.. అధికారికంగా ప్రకటించిన BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం టేబుల్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌ను నియమించింది. టీమిండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఇప్పటివరకు వైస్ కెప్టెన్‌గా కొనసాగిన హర్ధిక్ పాండ్యా గాయం కారణంగా వరల్డ్ కప్‌ నుంచి నిష్ర్కమించడంతో అతడి స్థానంలో రాహుల్‌ను ఎంపిక చేసింది. అయితే, రాహుల్ కంటే ముందు పేసర్ జస్ర్పీత్ బూమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావించింది. కానీ, చివరకు కేఎల్‌ రాహుల్‌‌కే అవకాశం కల్పించింది. కాగా, వరల్డ్ కప్‌లో రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన ఏడు మ్యాచుల్లో 237 పరుగులు చేశాడు.

Next Story