ICC World Cup 2023: ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌

by Vinod kumar |
ICC World Cup 2023: ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆ జట్టు మ్యాచ్‌ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి బంగ్లాదేశ్‌ తమ కోటా ఓవర్ల కంటే ఓ ఓవర్‌ వెనుపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్‌ విధించింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.22 ప్రకారం బంగ్లాదేశ్‌ సభ్యులందరికీ ఈ ఫైన్‌ వర్తిస్తుంది. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు ఎహసాన్‌ రజా, పాల్‌ విల్సన్‌, థర్డ్‌ అంపైర్‌ అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌, ఫోర్త్‌ అంపైర్‌ కుమార ధర్మసేన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లపై ఛార్జ్‌ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్‌ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది.

బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. డేవిడ్‌ మలాన్‌ (140) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది.

Advertisement

Next Story

Most Viewed