- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రాణాలతో చెలగాటం.. 200 మంది రోగులు.. కేవలం గంటన్నర ఆక్సిజన్..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు సునామీలా ముంచుకొస్తున్నాయి. రోజువారీగా సుమారు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఓ వైపు బెడ్లు, మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వలన కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ నిండుకోవడంతో కొవిడ్ ఆస్పత్రుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెనాలి ఆస్పత్రిలో కేవలం గంటన్నర ఆక్సిజన్ నిల్వ మాత్రమే ఉంది.
ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో 200 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. సాంకేతిక కారణాలతో గుంటూరు జిల్లా తెనాలికి రావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు ఖమ్మంలో ఇరుక్కుపోయాయి. దీంతో పరిసర ప్రాంతాల నుంచి తాత్కాలికంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి రోగులకు చికిత్స అందిస్తున్నారు. గంట వ్యవధిలో ఆక్సిజన్ రాకపోతే తెనాలి జనరల్ ఆస్పత్రిలో కరోనా కల్లోలం సృష్టించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.