నావికాదళంలో కరోనా కలకలం

by vinod kumar |
నావికాదళంలో కరోనా కలకలం
X

న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల్లో ఒకటైన నావికాదళంలోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో పనిచేస్తున్న 20 మంది నావికాదళ సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీరిని ముంబైలోని కొలాబా ప్రాంతంలోని నేవీకి చెందిన అశ్వినీ ఆస్పత్రికి తరలించినట్టు భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెద్యులు తెలిపారు. ఈ ఘటనతో నావికాదళం అప్రమత్తమైంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బందికి సంబంధించిన సమావేశాలు, శిక్షణ, ప్రయాణాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నేవీ ప్రకటించింది.

Tags: indian navy, corona, 20 positive cases, mumbai

Advertisement

Next Story