న‌ల్ల‌గొండ‌లో మరో ఇద్దరికి కరోనా

by  |   ( Updated:2020-04-06 07:11:11.0  )
న‌ల్ల‌గొండ‌లో మరో ఇద్దరికి కరోనా
X

దిశ, న‌ల్ల‌గొండ‌: న‌ల్ల‌గొండ జిల్లాలో సోమవారం మ‌రో ఇద్ద‌రు వ్యక్తులకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయినట్టు డీఎంహెచ్‌వో కొండ‌ల్‌రావు తెలిపారు. ప‌ట్ట‌ణంలోని ఓ మ‌సీదుకు మయన్మార్ దేశ‌స్తులు 15మంది, జ‌మ్ముకాశ్మీర్‌కు చెందిన మరో ఇద్ద‌రు వ‌చ్చార‌ని వెల్లడించారు. ఇందులో అనుమానితులుగా భావించిన ఐదుగురిని హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రికి త‌ర‌లించినట్టు చెప్పారు. వీరిలో ఇద్ద‌రు వ్యక్తులకు మూడు రోజుల కిందట క‌రోనా నిర్దార‌ణ కాగా, మ‌రో ఇద్ద‌రికి ఈ రోజు పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వివరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌ల్ల‌గొండ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు న‌మోదైనట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. కాగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని యాదాద్రిలో ఒక్క కేసు కూడా న‌మోదు కాకపోవడం శుభపరిణామమన్నారు. జిల్లాల వారీగా చూసుకుంటే సూర్య‌ాపేట‌-8, న‌ల్ల‌గొండ‌-15 మొత్తం క‌లిపి 23 కేసులు నమోదయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

Tags: corona, lockdown, nalgonda, 2 corona positive cases

Advertisement

Next Story

Most Viewed