ఒకే బస్సుకు 2 రోజుల్లో 2 ప్రమాదాలు

by Anukaran |
ఒకే బస్సుకు 2 రోజుల్లో 2 ప్రమాదాలు
X

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. జీవన్గి నుండి తాండూరుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుముందు భాగం కమాన్ కట్టలు విరిగి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కండక్టర్ సహా ముగ్గురికి గాయాలవగా… లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. చికిత్స కోసం మహిళలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇదే బస్సు బషీరాబాద్ మండలం గోటికేకుర్దు వద్ద రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురి కావడం విశేషం.

Advertisement

Next Story