పాఠశాల విద్యార్థులు ఆల్ ప్రమోటెడ్

by Shyam |
students are all promoted
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాల విద్యార్థులందరిని ప్రమోట్ చేస్తున్నట్టుగా విద్యాశాఖ ప్రకటించింది. 1 నుంచి 9వ తగరగతి విద్యార్థులందరిని పై తరగతులకు అనుమతిస్తున్నట్టుగా తెలిపారు. ఈ రోజు (ఏప్రెల్ 27) నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటిచారు. కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో విద్యార్థులను వైరస్ నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టినట్టుగా ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని వివరించారు. తరగతుల ప్రారంభంపై జూన్ 1న సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed