కందుకూరులో తొలి కరోనా మరణం

by Shyam |
కందుకూరులో తొలి కరోనా మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా, పాజిటివ్ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కందుకూరు మండలంలో తొలి కరోనా మరణం సంభవించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెళ్లికి చెందిన 70 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతన్ని వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed