ఒక్కరోజే వేయికి పైగా మరణాలు

by vinod kumar |
ఒక్కరోజే వేయికి పైగా మరణాలు
X

న్యూఢిల్లీ : రెండో దశలో కరోనా మహమ్మారి సాగిస్తున్న విలయతాండవం కొనసాగుతున్నది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఆందళనకరంగా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో వేయికి పైగా మరణాలు నమోదయ్యాయి. కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,84,372 మంది కరోనా బారిన పడ్డారు. 1,027 మంది మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 13 లక్షలు (13,65,704) దాటింది. మొత్తం మరణాల సంఖ్య 1,72,085 కు చేరింది. ఇక నిన్న 82,339 మంది డిశ్చిర్జి కాగా.. దేశంలో 11 కోట్ల మంది (11,11,79,578) కి పైగా వ్యా్క్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story