- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క టీవీ వల్ల.. ఊరంతటికీ నెట్ అంతరాయం!
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్‌లోని అబెరోసన్ అనే పల్లెటూరులో గత పద్దెనిమిది నెలలుగా ఉదయం 7 అయిందటంటే చాలు.. ఊరు మొత్తం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయి. స్థానికులంతా నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు ప్రతిరోజూ కంప్లయింట్స్ చేస్తూనే ఉన్నారు. సమస్యను పరిష్కరించేందుకు వాళ్లు కూడా డెయిలీ చెక్ చేస్తూనే ఉన్నా, కారణం మాత్రం కనుక్కోలేకపోయారు. అయితే ఎట్టకేలకు.. ఏడాదిన్నర తర్వాత ఇంటర్నెట్ అంతరాయానికి అసలు కారణాన్ని కనుగొన్నారు.
‘ఓపెన్‌రీచ్’ అనే సంస్థ అబెరోసన్ గ్రామ ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. ఆ బ్రాడ్‌బ్యాండ్ నెట్ స్పీడ్, సేవలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఉదయం గడియారంలో ఏడో గంటకొట్టగానే.. ఊరు ఊరంతా ఇంటర్నెట్ సేవలు ఆగిపోయేవి. ఇలా ఒక్కరోజు, నెలకాదు.. పద్దెనిమిది నెలలుగా ఇదే తంతు కొనసాగింది. దీంతో ఓపెన్‌రీచ్‌కు కంప్లయింట్స్ వెల్లువెత్తేవి. సమస్య పరిష్కారానికి ఓపెన్‌రీచ్ ఉద్యోగులు, ఇంజనీర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయినా ఫలితం శూన్యం. ఏడాదిన్నర పాటు విశ్వప్రయత్నాలు చేసి, చివరికి ఎలక్ట్రికల్ తరంగాల అంతరాయం ఏదైనా ఉంటే గుర్తించే ‘స్పెక్ట్రమ్ అనలైజర్’ అనే పరికరాన్ని తీసుకొచ్చి ప్రయత్నించి చూశారు. ఊరంతా జల్లెడ పట్టారు. ఆ రోజు కూడా ఎప్పటిలానే ఏడు గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఓ చోట పెద్ద స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంటర్‌ఫియరెన్స్ వస్తున్నట్లు పరికరంతో గుర్తించారు. అక్కడికెళ్లి చూస్తే.. ఇదంతా ఓ పాత టీవీ నుంచి వెలువడుతున్న ఎలక్ట్రికల్ ఇంటర్‌ఫియరెన్స్ వల్లే అని ఓపెన్‌రీచ్ ఇంజనీర్లు కనిపెట్టారు.
పాత టీవీ ఉపయోగించే యజమానికి.. ప్రతిరోజు ఏడు గంటలకే టీవీ పెట్టుకోవడం అలవాటు. కాగా ఆ టీవీ నుంచి వెలువడే ‘సింగిల్ హెలైవెల్ ఐసోలేటెడ్ ఇంపల్స్ నాయిస్ (shine)’ అనే ఎలక్ట్రిక్ తరంగాల వల్ల ఇంటర్నెట్ కనెక్షన్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకుని ఆ టీవీ యజమాని కూడా ఆశ్చర్యపోయారు. అయితే తాను ఇకపై టీవీని ఉపయోగించనని, తన పేరు మాత్రం బయటకు చెప్పొద్దంటూ తెలిపడం గమనార్హం.