- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రైలు ప్రమాదం.. 17 మంది వలస కూలీలు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఔరంగబాద్- జల్నా మధ్యనున్న రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ విషాదకర ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాలు ఇలా.. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు రైల్వే ట్రాక్‌ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అలసిన కూలీలు ట్రాక్ మీదే నిద్రించారు. అదే ట్రాక్‌పై మృత్యు రూపంలో వచ్చిన గూడ్స్ రైలు.. వారి పైనుంచే దూసుకెళ్లింది. దీంతో వారంతా నిద్రలోనే మృత్యులోయలోకి జారుకున్నారు. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను డీసీఎంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.
Tags: train accident, Aurangabad,migrant workers, dead,maharastra, 7 migrants died