- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెచ్ఈసీఎల్‌లో 169 ట్రైనీ ఉద్యోగాల భర్తీ
హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీఎల్)లో 169ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ నెల 31వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా, దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
మొత్తం 169ఖాళీల్లో.. 116 గ్రాడ్యుయేట్ ట్రైనీలు, 53 టెక్నీషియన్ (డిప్లోమా) ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు:
అభ్యర్థులు గ్రాడ్యుయేట్ లేదా టెక్నీషియన్ (డిప్లొమా)లో సంబంధిత బ్రాంచ్ లేదా డిసిప్లిన్‌లో కనీసం 55శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అయితే 50శాతం ఉంటే సరిపోద్ది.
29-02-2020 నాటికి అభ్యర్థి వయస్సు 18 ఏండ్లలోపు ఉండకూడదు. 20 ఏండ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్సీఎల్, వికాలాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిలాగ్జేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.500 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తు విధానం:
http://hecltd.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత గడువులోగా నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
GM/HTI HEC Training Institute (HTI)
Plant Plaza Road, Dhurwa
Ranchi- 834004
Jharkhand
పూర్తి వివరాలకు http://hecltd.com/ వెబ్‌సైట్‌లో చూడగలరు.
Tags: HEC Recruitment 2020, HECL, trainees, jobs, graduates, deploma