- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఒక్క రోజే 169 కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో కరోనా మహామ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో వరుసగా మూడో రోజు ట్రిపుల్ డిజిట్‌లో కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రోజు వ్యవధిలో ఇంత ఎక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బుల్లెటిన్ ప్రకారం ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (లోకల్, నాన్ లోకల్ కలిపి) 2,425కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 100 రాష్ట్రానికి చెందినవి కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 64 మందికి, వలస కార్మికుల్లో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. లోకల్‌గా నమోదైన 100 కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీకి చెందిన వారు 82 మంది ఉండగా రంగారెడ్డి నుంచి 14, మెదక్ 2, సంగారెడ్డి నుంచి 2 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,381 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 71 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 973 యాక్టివ్ కేసులున్నాయి. సౌదీ నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 207 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.