రాష్ట్రంలో తాజాగా 163 కరోనా కేసులు

by Shyam |   ( Updated:2021-02-17 23:34:19.0  )
రాష్ట్రంలో తాజాగా 163 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. ఇప్పటివరకు 1,622 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,93,791 మంది డిశ్చార్జ్ అయ్యారు.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

Advertisement

Next Story

Most Viewed