ఈ బ్రదర్స్ 51ఏండ్ల కల.. ఇన్నాళ్లకు!

దిశ, వెబ్ డెస్క్ :
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 70 ఏళ్ళు పైబడిన ఇద్దరు సోదరులు నిరంతరం శ్రమించారు. 150 నదుల నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. రాధే శ్యామ్ పాండే, శబ్ద వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే ఇద్దరు సోదరులు 8 నదులు, మూడు సముద్రాల నుంచి నీటిని, శ్రీలంకలోని 16 స్థలాల నుంచి మట్టిని కూడా సేకరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని తాము తహతహలాడుతున్నామని వీరు చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న నదుల నుంచి పవిత్ర జలాలు, శ్రీలంకలోని పదహారు చోట్ల నుంచి మట్టిని సేకరించాలన్నది తమ లక్ష్యమని, ఇన్నేళ్లకు ఆలయ నిర్మాణానికి సంబంధించి తాము కన్న కలలు నిజం కాబోతున్నాయని రాధే శ్యామ్ ఆనందం వ్యక్తంచేశారు. 1968 నుంచి 2019 వరకు అనగా సుమారు 51 ఏండ్లుగా తాము కాలినడకన, ఒక్కోసారి బైక్ పైన, మరికొన్నిసార్లు, రైలు, విమానాల ద్వారా ప్రయాణిస్తూ వచ్చామని పేర్కొన్నారు. కాగా, ఆగస్టు 5న అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని భూమి పూజ చేయనున్న విషయం విదితమే.

Advertisement