- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేబిస్‌తో ‘15’ మంది మృతి.. రికార్డులో ఎక్కించని వైద్యశాఖ
దిశ, తెలంగాణ బ్యూరో : కుక్కకాటుతో ప్రబలే రేబిస్వ్యాధితో రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్టు సమాచారం. కానీ వైద్యారోగ్యశాఖ రికార్డుల్లో ఆ వివరాలను నమోదు చేయలేదు. తెలంగాణలో ‘రేబిస్ వ్యాధిని ఎలిమినేషన్’ చేశామని గొప్పలు చెప్పుకునేందుకే ఎంట్రీ చేయలేదని ఆ విభాగంలోని కొందరు అధికారులు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. పరిస్థితిని కుణ్ణంగా వివరించి ప్రజలకు అవగాహన చేయాల్సిన అధికారులు ఇలా చేయడం పై ఆ శాఖలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ మెప్పు పొందేందుకు ప్రజారోగ్యశాఖలోని కొందరు అధికారులు ఇలా విధుల్లో నిర్లక్ష్యం చూపుతున్నారు. తప్పుడు లెక్కలు చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నారు.
9 నెలల్లో 98 వేల కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 9 నెలల్లో 98,200 డాగ్ బైట్ కేసులు నమోదయ్యాయి. దీనిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 15,240 కేసులు ఉండగా, ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 8,521 కేసులు, సంగారెడ్డిలో 6,800 కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో సగటున 5 వేల కేసులు చొప్పున తేలాయి. ఈ ఏడాది భారీ స్థాయిలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నా, అధికారుల్లో నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తున్నది. కరోనా నియంత్రణ చర్యల్లో పడి, ఇతర రోగాలను మర్చిపోయారు. ముఖ్యంగా ఇలాంటి ప్రాణాంతక డీసీజెస్ను లైట్ తీసుకోవడం వలన రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
వ్యాక్సిన్ తప్పనిసరి…
కుక్క కరిచినవాళ్లు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడితే బతికే ఛాన్స్తక్కువ కావున కచ్చితంగా రేబిస్టీకాను పొందాల్సిందేనని ఆరోగ్యశాఖ పలుమార్లు పేర్కొంటున్నది. కానీ చాలా మంది అవగాహన లోపంతో స్థానికంగా ఉండే క్లినిక్లలో మందులు వాడి, ఏం కాదులే అనే భావనతో టీకా తీసుకోవడం లేదంటున్నారు. ఇది సరైన పద్ధది కాదని వారు సూచిస్తున్నారు. కుక్క కాటు వేయగానే వెంటనే ప్రభుత్వ కేంద్రాల్లో ఉన్న టీకాను పొందాలంటున్నారు. దీని వలన రేబిస్వ్యాధి ప్రభావం ఇతర అవయవాలపై ఉండదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీ స్థాయి నుంచే ఇవి అందుబాటులో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ లో ని ఫీవర్, ఐపీఎంలలో రేబిస్వ్యాక్సిన్కు ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ చెబుతున్నది. ఇదిలా ఉండగా రేబిస్ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతీ ఏటా కొన్ని ప్రత్యే క నిధులను కేటాయిస్తున్నది. కానీ ప్రభుత్వం, వైద్యశాఖ కుక్కకాటు నియంత్రణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని స్వయంగా హెల్త్ ఆఫీసర్లే క్లారిటీ ఇచ్చారు.
నెలకు 3 కేసులు వస్తున్నాయి….
కుక్కకాటు అనంతరం ఐపీఎం( ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్)కు ప్రతీ నెల ముగ్గురు రేబిస్పేషెంట్లు వస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే మూడేళ్ల వరకు రేబిస్ సోకే అవకాశం ఉండదని డైరెక్టర్ డా శంకర్ తెలిపారు. అయితే రోడ్ల మీద వెళ్లేటపుడు కుక్కలతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించవద్దని సూచించారు. రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.