వచ్చే నెలలో 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.. ఎందుకో తెలుసా?

by Anukaran |   ( Updated:2021-07-25 23:50:38.0  )
వచ్చే నెలలో 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికి బ్యాంక్‌లో ఎదో ఒక పని ఉంటుంది. అయితే కొంత మంది పనిని వాయిదా వేస్తుంటారు. ఈ రోజు కాదు రేపు కూడా బ్యాంకు ఉంటుంది కదా, రేపు పని చూద్దాంలే అన్నట్టుగా ఉంటారు. వారికి బ్యాంకు సెలవు దినాలు తెలియకపోవడం వలన పనిని వాయిదా వేస్తారు. అత్యవసరం సమయం వచ్చినప్పడు బ్యాంకుకు సెలవు ఉంటుంది. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం.
వచ్చే నెల అంటే ఆగష్టులో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. అందువల్ల మీరు బ్యాంకులు ఏ ఏ రోజుల్లో పని చేయవో ముందే తెలుసుకుంటే మంచిది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఏదైనా పని ఉన్న ఒక రోజు ముందు చేసుకోవడానికి వీలుకలుగుతుంది. దేశీ కేంద్ర బ్యాంక్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే.. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు. ఆగష్టులో పండుగలు మొదలవడంతో ఆ నెలలో సెలవు దినాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ తేదీలలో బ్యాంకులకు సెలవులు

ఆగస్ట్ 1 ఆదివారం
8 ఆదివారం
13 దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్)
14 రెండో శనివారం
15 ఆదివారం ఇండిపెండెన్స డే
16 పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్)
19 మొహరం
20 ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ)
21 తిరుఓనం (కొచ్చి, కేరళ)
22 రక్షాబంధన్
23 శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ)
28 నాలుగో శనివారం
29 ఆదివారం
30 జన్మాష్టమి
31 శ్రీ కృష్ణాష్టమి. ఇలా ఆగష్టు నెలలో పదిహేను రోజులు బ్యాకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవు దినాలు అనేవి రాష్ట్రం ప్రాతిపదికన బ్యాంక్ సెలవులు మారతాయని గుర్తించుకోవాలి.

Read more : వాట్సాప్ వాడే వారు ఇవి తప్పక తెలుసుకోవాలి..

Advertisement

Next Story