తెలంగాణలో తాజాగా 148 కరోనా కేసులు

by Shyam |
తెలంగాణలో తాజాగా 148 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 148 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950 కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,620 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,640 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,93,690 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed