ఢిల్లీలో 144 సెక్షన్

by Shamantha N |
ఢిల్లీలో 144 సెక్షన్
X

దిశ, న్యూస్ బ్యూరో

కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగరంలో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. ఢిల్లీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ పోలీసు శాఖ మాత్రం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ తరఫున పోలీసు కమిషనర్ ఈ ప్రకటన చేశారు. ఈ నిర్బంధం కారణంగా నగరంలో ర్యాలీలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, జనం గుమికూడడం లాంటివన్నీ నిషేధం. మతపరమైన కార్యకలపాలతో సహా స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సనలు, సమావేశాలు తదితరాలన్నీ నిలిపివేయాల్సి ఉంటుంది. ఇక వారపు సంతలు, ఎగ్జిబిషన్లు కూడా ఆగిపోతాయి. నిత్యావసర సరుకులు లాంటివి మాత్రం మినహాయింపు కోవలోకి వస్తాయి. ఏదేని ఉల్లంఘనలు జరిగినట్లయితే సెక్షన్ 188 కింద శిక్షార్హులవుతారని ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. అన్ని మున్సిపల్ శాఖలతో సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Tags: Delhi, 144 Section, Corona, Home Ministry

Advertisement

Next Story