ఆ బాలిక రేటు.. గంటకు రూ.18,500

by vinod kumar |   ( Updated:2020-08-15 09:14:13.0  )
ఆ బాలిక రేటు.. గంటకు రూ.18,500
X

దిశ, వెబ్‌డెస్క్: 14 ఏండ్ల మైనర్ బాలిక.. గంటకు రూ. 18500లకు భేరం.. రోజుకీ కనీసం 5గురితో డేటింగ్.. ఇది ఆ బాలికకు ఉన్న కండీషన్స్.. ఆమె వద్దకు వచ్చే వారు తప్పని సరిగా కండోమ్ ధరించాలి.. అలాగే, ముందు డబ్బులు చెల్లించే డేటింగ్‌కు వెళ్లాలి.. లేదంటే డబ్బులు ఎగ్గొడుతారు.. అంటూ ఓ 17 ఏండ్ల కుర్రాడు వైనర్‌ను డేటింగ్‌లోకి దించిన వ్యవహారం అమెరికాలో వెలుగుచూసింది.

అమెరికా‌కు మియామీకి చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో గొడవ పడి బయటకొచ్చేసింది. అయితే, బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయాక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టకపోవడం గమనార్హం. తర్వాత జరిగిన విషయం తన స్నేహితురాలితో షేర్ చేసుకుంది. దీంతో సదరు బాలిక క్వింటెరో అనే 17 ఏళ్ల కుర్రాడికి పరిచయం చేసింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న క్వింటెరో.. మైనర్‌కు మాయమాటలు, డబ్బు ఆశ చూపించాడు. డబ్బులు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అంటూ.. అందుకోసం డేటింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు.

దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత బాలిక అందుకు ఒప్పుకుంది. అనంతరం ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి లొంగదీసుకున్న క్వింటెరో రోజుకీ 5గురితో డేటింగ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ తర్వాత బాలికను ఓ హోటల్‌ రూములోనే ఉంచాడు. అనుకున్న ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసి బాలికను అడ్డుపెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు. వచ్చిన డబ్బులతో మత్త పదార్థాలు తీసుకుంటూ జల్సాలు చేశాడు. వచ్చిన డబ్బుల్లో ఎక్కువగా క్వింటెరో‌నే తీసుకొని ఆమెకు సరిపడ మాత్రమే ఇచ్చేవాడు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ నుంచి డేటింగ్ చేయిస్తున్న వ్యవహారం కాస్తా బాధితురాలి తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న క్వింటెరో బాలికను హోటల్‌లో వదిలి పరారీ అయ్యాడు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. క్వింటెరోను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై మానవ అక్రమ రవాణా, డేటింగ్ కేసులు నమోదు చేసి జువైనల్‌ హోమ్ కి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed