- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా విజృంభణ
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ ఏపీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో ఏపీ వాసులు 1,155 కాగా, ఒకరు విదేశాలకు చెందిన వ్యక్తి, మరో 22మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
అత్యధికంగా గుంటూరు జిల్లాలో 238పాజిటివ్ కేసులు నమోదు కాగా, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుని 762 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,197కు చేరుకుంది. ఇందులో ఏపీకి చెందిన వారు 18,520 మంది అయితే విదేశాలకు సంబంధించిన 420మందికి ఇతర రాష్ట్రాలకు చెందిన 2,257 మందికి కరోనా సోకిందని తెలిపింది. ఇందులో 11,200 యాక్టివ్ కేసులు ఉండగా, 9,745 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారని, దీంతో ఏపీలో ఇప్పటి వరకు 252 మంది మృత్యువాతపడ్డారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.