- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
111ఏళ్ల రెట్టింపు ఉత్సాహంతో..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 111 ఏళ్ల బామ్మ రెట్టింపు ఉత్సాహంతో వచ్చి తన ఓటును వినియోగించుకుంది. గతేడాది కంటే ఈ ఏడాది ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అన్ని సర్వేలు చెబుతుండగా బామ్మ వేసిన ఓటు ప్రాధాన్యతను సంతరించుకుంది.శనివారం 4గంటల వరకు దేశ రాజధానిలో పోలింగ్ నెమ్మదిగా సాగింది. అక్కడి యువత,ఉద్యోగులు ఈసారి ఓటు వేసేందుకు అనాసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. కాగా, కాళితార మండల్ అనే వృద్ధురాలు మాత్రం సీఆర్ పార్క్ సెంటర్‌కు వచ్చి తన ఓటేసింది. ఈ సందర్భంగా బామ్మ మాట్లాడుతూ..తనకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్టు తెలిపింది. ఓటు వేసే సందర్భాన్ని తానెంతో ఎంజాయ్ చేస్తానంటోంది. ఓటు అనేది తనకు శక్తినిస్తుందని, ప్రతీ పౌరుడు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చింది. బామ్మకు దంతాలు లేనప్పటికీ తనకు చేపలు అంటే ఇష్టమని ఢిల్లీలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదగా సమాధానమిచ్చింది. ఈమె ఢిల్లీలోని బెంగాలీ వాడలో నివసిస్తోంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ బామ్మ ఓటేయగా, ఈసారి ఓటు వేసేందుకు వచ్చిన బామ్మకు ఎన్నికల అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి గౌరవించారు.