- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
110 ఏళ్ల బామ్మ పాట.. ట్రెండింగ్
దిశ, ఫీచర్స్: యూకేలోని వేల్స్ నగరంలో ఆమె అత్యంత వయసు కలిగిన వ్యక్తి, బహుశా ప్రస్తుతం టిక్‌టాక్ ప్లాట్‌ఫాం మీద ఆమె ఓల్డెస్ట్ పర్సన్ కావొచ్చు. ఇంతకీ ఎవరు ఆమె అంటారా? ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా 110 ఏళ్ల ఎమీ హాకిన్స్. ఆమె పాడిన ఓ పాటను తన మనవడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో ‘ఎమి హాకిన్స్’ పేరు నెట్టింట్లో వైరల్ అయింది.
వేల్స్‌కు చెందిన ఎమి మాజీ నర్తకి. గత వారం ఆమె పాడిన హాల్ సాంగ్ ఆమెకు ఒక్కసారిగా గుర్తింపు తీసుకొచ్చింది. గత ఆదివారం ఆమె 110వ ఏటా అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమి ఓ పాట పాడింది. దాన్ని టిక్‌టాక్‌లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్‌తో అది దూసుకోపోతోంది. ఆమె తన 14వ ఏటా డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. 1937లో, సైన్ రైటర్ జార్జ్ హాకిన్స్‌ను వివాహం చేసుకుని, చాలా కాలం పాటు న్యూపోర్ట్‌లో నివసించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమీ హాకిన్స్ ఫైర్-వాచర్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి సంతోష జీవనం గడుపుతోంది. ‘బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్ చేయాలని నిర్ణయం ది బెస్ట్ అని అనుకుంటున్నా. మా బామ్మకు టిక్‌టాక్ అంటే ఏమిటో అంతగా అర్థం కాదు, కానీ ఆమె ఒకే పాటతో సింగింగ్ సెన్సేషన్‌గా నిలవడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్ డే గిఫ్ట్‌గా మేము భావిస్తున్నాం’ బామ్మతో కలిసి టిక్‌టాక్ వీడియోలో కనిపించిన మనవరాలు మోరిస్ చెప్పుకొచ్చింది.
Amy Hawkins is still singing – at 110 years old 🎵
She's become a social media sensation… pic.twitter.com/UYhKZqu998— BBC Wales News (@BBCWalesNews) January 30, 2021