- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరంగల్ అర్బన్‌లో పదేళ్ల బాలికకు కరోనా
దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్యాధికారి లలితా దేవి తెలిపారు. మంగళవారం నగరంలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పరీక్షల్లో పూరిగుట్టకు చెందిన బాలికకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ బాలికను తదుపరి వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పూరిగుట్ట ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ ఏరియాగా ప్రకటించామన్నారు. బుధవారం నుంచి ఆ ప్రాంతంలో ఇంటింటికి సర్వే చేపట్టనున్నట్టు ఆమె వెల్లడించారు.
Tags: corona positive,warangal urban, 10yrs old girl, shifted to gandhi hospital
Advertisement
Next Story