వరంగల్‌లో కూతురు నుంచి తల్లికి సోకిన కరోనా

by vinod kumar |   ( Updated:2020-05-04 10:00:04.0  )

దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కూతురు నుంచి తల్లికి కరోనా సోకింది. ప్రస్తుతం ఇద్దరూ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వరంగల్ పూరిగుట్టకు చెందిన పదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆ బాలిక తల్లికి సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి అధికారికంగా ప్రకటించారు.

tags: corona positive, warangal, dist dmho lalitha devi, 10yrs old girl

Advertisement

Next Story