అర్ధరాత్రి 108 ఈఎంటీపై కత్తులతో దాడి

by Sumithra |
అర్ధరాత్రి 108 ఈఎంటీపై కత్తులతో దాడి
X

దిశ, నల్లగొండ: అర్వపల్లి మండల కేంద్రంలో 108లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) నిరంజన్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గత రాత్రి విధుల్లో భాగంగా కార్యాలయంలో నిద్రిస్తున్న సమయంలో నిరంజన్‌పై దాడి జరిగింది. మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. నిరంజన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దాడి చేసినది ఎవరు అనే దానిపై విచారణ ముమ్మరం చేశారు. ఈ దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరంజన్ వద్దకు విచారణ నిమిత్తం వెళ్లినట్టు తెలుస్తున్నది.

Tags : 108 EMT, Attack, midnight, swords, nalgonda, MPDO Office

Advertisement

Next Story

Most Viewed