విశాఖ ఉద్య‌మానికి 100 రోజులు.. ఇప్ప‌టికైనా కేంద్రం వెన‌క్కి తగ్గేనా?

by srinivas |
vishaka steel plant protests
X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మానికి 100 రోజులైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించాలని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అంటూ ఉద్య‌మం సాగుతోంది. బీజేపీ మిన‌హా అన్ని పార్టీలు ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపి నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాయి. నిర‌స‌న‌ల్లో భాగంగా ప‌లుమార్లు చేప‌ట్టిన ఏపీ బంద్‌కు పార్టీల‌న్నీ మ‌ద్ద‌తిచ్చాయి.

అయితే ఈ ఉద్య‌మం చేప‌ట్టి నేటికి 100 రోజులు అయింది. ఈ సంద‌ర్భంగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ముందుగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఉద్య‌మం చేప‌ట్టి నేటికి 100 రోజులైంద‌ని, 32 మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడి వేలాది కుటుంబాలకు ఉపాధి నిస్తోందని వ్యాఖ్యానించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో 150 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి దేశ ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ అండగా నిలిచిందని, కేంద్రం ఇప్ప‌టికైనా ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని గంటా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed