రాజమండ్రిలో 10 మంది ఖైదీలకు కరోనా

by Anukaran |
రాజమండ్రిలో 10 మంది ఖైదీలకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దాదాపు 10 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు.

దీంతో వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా, ఏపీ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు 10 వేల కొత్త కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 1,86,461కు చేరాయి.

Advertisement

Next Story