- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎనుమాముల మార్కెట్లో మిర్చి మిస్సింగ్.. ఆ ఘనత వీరిదేనంట!
దిశ, వరంగల్ తూర్పు : వరంగల్ అర్భన్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దొంగలు పడ్డారు. గురువారం రైతులు తీసుకువచ్చిన బస్తాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మిర్చిని ఎత్తుకెళ్తున్న పలువురిని మార్కెట్ సిబ్బంది పట్టుకుని గదిలో బంధించారు. ఈ వ్యవహారం చాలా కాలంగా సాగుతోందని, బస్తాల నుంచి అందిన కాడికి దోచుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని సమాచారం. మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేనివారు గతంలో కూడా ఇలాగే వ్యవహరించడంతో కొంతకాలం ప్రైవేట్
వ్యక్తులు మార్కెట్‌లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ నిబంధనను తొలగించారు. దీంతో దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. కింద పడిన మిర్చి ఏరుకుంటున్నామని చెప్పి బస్తాల్లో ఉన్న వాటిని కూడా పెద్ద మొత్తంలో సేకరించి వీరంతా ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారు. విషయం తెలియడంతో మార్కెట్ సిబ్బంది మిర్చి దొంగతనానికి పాల్పడుతున్న పది మందికి పైగా వ్యక్తులను పట్టుకొని ఓ గదిలో బంధించారు.