ఐటీ శాఖ మెరుపు దాడులు

by Harish |
ఐటీ శాఖ మెరుపు దాడులు
X

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప సహా ఢిల్లీ, పూణే నగరాల్లో ఆదాయపన్నుశాఖ (ఐటీ) నిన్న రాత్రి మెరుపు దాడులు జరిపింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఈ సోదాల్లో భోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు గుట్టు రట్టు చేసింది. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్టు ఐటీ గుర్తించింది. అక్రమ లావాదేవీలను ఈ-మెయిల్, వాట్సప్‌ మెస్సేజుల ద్వారా గుర్తించిన ఐటీ శాఖ.. కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు స్వాధీనం చేసుకుంది. ఓ ప్రముఖ వ్యక్తి వద్ద ఒకప్పడు వ్యక్తిగత కార్యదర్శిగా చేసిన అనామకుడి ఇంటిపై జరిపిన దాడులతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. ఉనికిలో లేని కంపెనీలకు భోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు నకిలీ పత్రాలు సృష్టించి, దాదాపు రూ.2వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ.85లక్షలు నగదు, రూ.75లక్షల విలువ చేసే నగలు, 25బ్యాంక్ లాకర్లను అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed