‘జూమ్’ నయా ఫీచర్.. సుదూరాన ఉన్నవారంతా ఒకే చోట

by Anukaran |
‘జూమ్’ నయా ఫీచర్.. సుదూరాన ఉన్నవారంతా ఒకే చోట
X

దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలం నుంచి ‘జూమ్’తో పాటు మరెన్నో వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ వీడియో కమ్యూనికేషన్ యాప్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జూమ్ తమ వినియోగదారుల కోసం ‘ఇమ్మెర్సివ్ వ్యూ’ అనే కొత్త ఫీచర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో సుదూరాన ఉన్న వారంతా ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తారు.

జూమ్ ‘ఇమ్మెర్సివ్ వ్యూ’ ఫీచర్ గతేడాది జూమ్టోపియా సమావేశంలో ప్రకటించగా, ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇమ్మెర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉండగా, అంతా ఒకే హాల్లో పక్కపక్కన కూర్చుని మీటింగ్ అటెండ్ అయినట్లు తోస్తుంది. ఫీచర్‌ ప్రస్తుతానికి జూమ్‌ డెస్క్‌ టాప్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. జూమ్‌లో మాట్లాడుతున్నప్పుడు యూజర్ తనకు ఇష్టమైన బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండగా, కస్టమర్ తమ ఫేవరేట్ ఇమేజెస్‌ను వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకునేవాళ్లు. కాగా ఈ ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేస్తూ ‘ఇమ్మెర్సివ్ వ్యూ’ ఫీచర్ తీసుకొచ్చింది ‘జూమ్’.

సమావేశాలు, వెబ్‌నార్‌లకు ఈ ఫీచర్ ఉపయోగిస్తూ బోర్డు రూమ్, కాఫీ షాప్, క్లాస్‌రూమ్, ఆర్ట్ గ్యాలరీలను తలపించే విధంగా బ్యాక్ గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అయితే దీనిలో ఎలాంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ పని చేయాలంటే యూజర్లందరూ న్యూ వెర్షన్ జూమ్ యాప్‌‌ను ఉపయోగించాలి. 25 మంది పక్కపక్కన కనిపించగా, మిగిలినవాళ్లు థంబ్‌నైల్ వ్యూలో సైడ్‌కి కనిపిస్తారు. త్వరలో మన దేశంలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇదే తరహా ఫీచర్‌ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ‘టుగెదర్‌ మోడ్‌’ పేరుతో అందుబాటులో ఉంది.

జూమ్‌లో ఇమ్మెర్సివ్ వ్యూ కోసం..

– జూమ్ వెబ్ పోర్టల్‌కు సైన్ ఇన్ చేయాలి.
– నావిగేషన్ మెనుకి వెళ్లాలి.
– అకౌంట్ మేనేజ్‌మెంట్‌పై క్లిక్ చేసి, ఆపై అకౌంట్ సెట్టింగ్‌లు ట్యాప్ చేయాలి.
– ఇన్ మీటింగ్ (అడ్వాన్స్‌డ్) విభాగం కింద ‘మీటింగ్’ ట్యాబ్‌లో, ‘ఇమ్మెర్సివ్ వ్యూ’ ఆప్షన్‌పై ట్యాప్ చేసి, వెరిఫై చేస్తే సరిపొతుంది.

Advertisement

Next Story

Most Viewed