దినసరి కూలీలకు జొమాటో చేయూత

by Shamantha N |
దినసరి కూలీలకు జొమాటో చేయూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో దాదాపు 90 శాతం మంది శ్రామికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. వీరంతా కలిపితే 45 కోట్ల మందికి పైగా ఉంటారు. వీరందరూ తమ కుటుంబం ఒకరోజు గడవడానికి దినసరి కూలీలుగా పనిచేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా వ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్లందరూ వర్క్ ఫ్రం హోమ్‌కి ఇమిడిపోయారు. కానీ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్లకు ఆ అవకాశం లేకుండా పోయింది. కన్‌స్ట్రక్షన్ సైట్లు, దుకాణాలు, రెస్టారెంట్లలో పనిచేసే ఈ దినసరి కూలీలందరికీ ఇప్పుడ దిక్కు లేకుండా పోయింది. వారి కుటుంబం ఆకలితో పడుకోకుండా ఉండటానికి జొమాటో సంస్థ ‘ఫీడ్ ద డైలీ వేజర్’ పేరుతో ఒక ఇనిషియేటివ్ తీసుకువచ్చింది.

ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా ప్రస్తుతం పని లేక రోజువారీ ఆహారానికి ఇబ్బందులు పడుతున్న కార్మికులకు సాయం చేయనుంది. దీనికోసం గోధుమపిండి లేదా బియ్యం, రెండు రకాల పప్పు దినుసులు, ఒక సబ్బు గల కిట్‌ని జొమాటో తయారు చేసింది. ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి ఒక వారానికి సరిపడ సరుకులు ఈ కిట్‌లో ఉన్నాయి. ఈ కిట్ల కోసం గ్రోఫర్స్ సంస్థ జొమాటోకి సాయం చేస్తోంది.

అయితే ఒక్కో కిట్ ధర రూ. 500, వీటిని 26 నగరాల్లోని స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్మిక కుటుంబాలకు పంచిపెట్టనున్నారు. ఇందులో భాగంగా జొమాటోకి రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తం కోసం విరాళాలు సేకరించడానికి జొమాటో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగమై మీకు తోచినంత సాయం చేయడానికి feedingindia.org/donate వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి డబ్బు విరాళంగా ఇవ్వొచ్చు.

Tags: Zomato, Feeding india, organised sector, daily wagers

Advertisement

Next Story

Most Viewed