- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీ5 లాంచ్ చేసిన 'హైపై' షార్ట్ వీడియో యాప్
దిశ, వెబ్ డెస్క్ :
టిక్‌టాక్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. టిక్‌టాక్(tiktok)ను పోలిన చింగారీ, మిత్రోన్, మోజ్ వంటి ఎన్నో దేశీ యాప్‌లు రూపొందాయి. ఇవేకాక తాజాగా జీ గ్రూపు నుంచి ‘హైపై(hipi) పేరుతో షార్ట్ వీడియో యాప్ శనివారం లాంచ్ అయ్యింది. మరోవైపు ఫేస్‌బుక్(facebook) సొంతమైన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో టిక్‌టాక్ తరహా షార్ట్ వీడియోలు షేర్ చేసుకోవడానికి ఇప్పటికే ‘ఇన్‌స్టా రీల్స్’(Instagram reels) ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇక జీ గ్రూపు ‘హైపై’ యాప్ తీసుకొస్తున్నట్టు గత నెలలోనే ప్రకటించింది. అనుకున్నట్లుగానే.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా, మరో వారం రోజుల్లో ఐఓఎస్(iOS) యూజర్లు కూడా ఉపయోగించుకునే చాన్స్ కల్పించనుంది. అయితే, ‘హైపై’ అనేది సెపరేట్ యాప్ కాదు. ప్రస్తుతం రన్ అవుతున్న ‘జీ5(Zee5)’ యాప్‌లోనే దీన్ని తీసుకురావడం గమనార్హం. జీ5 ఆండ్రాయిడ్ యూజర్లు అప్‌డేట్ చేసుకుంటే.. హైపై యాప్ వస్తుంది. అయితే, అప్‌డేట్ తర్వాత హైపైలోకి వెళ్లాలంటే.. యూజర్లు సైన్ అప్ కావాల్సి ఉంటుంది. ఇందులో యూజర్లు 90 సెకన్ల నిడివి గల వీడియోలను రూపొందించుకోవచ్చు. అంతేకాదు వీడియోలకు యూనిక్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ కూడా జత చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 400 ఇన్‌ఫ్లూయన్సర్స్, జీ టీవీకి చెందిన 70 మంది సెలెబ్రిటీలు ఈ యాప్‌ను ఫాలో చేస్తారని వెల్లడించింది.
ప్రస్తుతం ఫేస్‌బుక్ కూడా షార్ట్ వీడియోస్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై తెచ్చేందుకు టెస్ట్ చేస్తోంది. అందుకోసం ‘షార్ట్ వీడియోస్’ అనే డెడికేటెడ్ సెక్షన్‌తో పాటు ‘క్రియేట్’ బటన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. క్రియేట్ బటన్‌పై ప్రెస్ చేయగానే.. ఫేస్‌బుక్ యూజర్ల వీడియోలను చూడొచ్చు. సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా ఈ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ గురించి ట్వీట్ చేశాడు.