- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాడీ షేమింగ్‌పై జరీనా ఖాన్ సీరియస్..
by Shyam |

X
దిశ, సినిమా : ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాకే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని తెలిపింది హీరోయిన్ జరీనా ఖాన్. కాలేజీలో ఉన్నప్పుడు 100కిలోల బరువు మించి ఉన్నా సరే తనెప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని చెప్పింది. ఆ విషయం గురించి మాట్లాడేందుకు కూడా భయపడేవారని తెలిపింది. కానీ ఇప్పుడు అందులో సగం బరువు ఉన్నా సరే తనను ఫ్యాట్ స్టార్ అని పిలవడం విచిత్రంగా అనిపిస్తుందని చెప్పింది. తాను నటిని కాబట్టి నటనా సామర్థ్యాలపై కామెంట్ చేయాలి తప్పా బరువు, రంగు, ఎత్తు గురించి కాదని తెలిపింది. బాడీ షేమింగ్ గురించి మాట్లాడకూడదు అని చెప్పే వారే.. తాము సినిమా చేస్తున్నప్పుడు జీరో సైజ్డ్ గర్ల్స్‌ను ఎంచుకుంటారని చెప్పింది. ఇండస్ట్రీలో ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని వివరించింది జరీనా.
Next Story