- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND vs NZ టెస్టు : పూజారా ఒత్తిడిలో ఉన్నాడు.. జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. రేపటి మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. అయితే.. ఇటు కోహ్లీ రాకతో, అటు మొదటి టెస్టులో శ్రేయస్ అయ్యర్ రాణించడంతో పూజారా, రహానేకు తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పుజారాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.
రహానే, పూజారా విషయంలో జట్టు మరోసారి ఆలోచించాలని అన్నాడు. అదీ కాకుండా వీరిద్దరూ తుది జట్టులో ఉండాలి అనుకుంటే ఓపెనర్లు ఇద్దరిలో ఒకరిని పక్కనపెట్టి పూజారాను ఓపెనింగ్‌కు పంపాలని సూచించాడు. జట్టులో ఎవరినైనా పక్కకుపెట్టాలంటే ఓపెనర్లలో ఒకరిని తప్పించడం వంటివి మనం చాలాసార్లు చూశామని జహీర్ చెప్పుకొచ్చాడు. లేని క్రమంలో రహానే, పుజారాలో ఒకరిని తప్పించాల్సి ఉంటుందని సూచించాడు. తుది జట్టులో అయ్యర్‌కు మాత్రం కచ్చితంగా స్థానం ఉంటుందని తెలిపాడు. కాగా, కివీస్ లోయర్ ఆర్డర్ రాణించడంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.