Betting Apps Pramotion Case : బెట్టింగ్ యాప్ కేసు సిట్ కు బదిలీ

by M.Rajitha |
Betting Apps Pramotion Case : బెట్టింగ్ యాప్ కేసు సిట్ కు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు(Betting Apps Pramotions Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటులు, యాంకర్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని వ్యసనాల బారిన పడనివ్వబోమని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వివాదం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసును ప్రత్యేక దర్యాప్తు విభాగానికి(SIT) బదిలీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. కాగా బెట్టింగ్‌ యాప్స్‌ కేసులన్నింటిని సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది నేడు కోర్టుకు తెలిపారు. ఇకపై ఇన్ కేసును సిట్ విచారిస్తుందని.. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అందజేశారని పేర్కొన్నారు.

కాగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోవడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిలో భాగంగా చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసిన వారిపై తెలంగాణ గేమింగ్ యాక్ట్ మరియు ఐటీ యాక్ట్ కింద పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో పలువురు ప్రముఖ నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు బుక్ చేశారు.

Next Story

Most Viewed