- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్‌బాష్ లీగ్‌లో యువరాజ్ సింగ్?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL) తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన బిగ్ బాష్ లీగ్ (Big Bash League)లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు గుడ్‌బై చెప్పిన యువీ ఆ తర్వాత గ్లోబల్ టీ10 లీగ్ (Global T10 League)లో పాల్గొన్నాడు. అతడిని తిరిగి దేశవాళీ క్రికెట్‌లోకి తీసుకొని రావాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (Punjab Cricket Association) భావించింది.
అయితే ఒకసారి ఇతర ప్రైవేట్ లీగ్‌లో ఆడిన వాళ్లను బీసీసీఐ తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడటానికి ఒప్పుకోదు. దీంతో ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్ బాష్ (Big Bash) పట్ల అతడు ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తున్నది. వెస్టిండీస్‌లో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ (Caribbean Premier League)లో కూడా ఆడతాడని వార్తలు వచ్చినా.. కరోనా కారణంగా అతడు వెనక్కు తగ్గినట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు బిగ్ బాష్‌లో యువరాజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో సచిన్ కోసం సిడ్నీ థండర్స్ (Sydney Thunders) సంప్రదించింది. ఆ తర్వాత ఏ భారతీయ ఆటగాడి కోసం కూడా ప్రయత్నాలు జరగలేదు. తాజాగా యువరాజ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే దీనిపై యువరాజ్ ఇంకా స్పందించలేదు.