- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Karge: పటేల్ భావజాలం ఆర్ఎస్ఎస్‌కు విరుద్ధం.. సీడబ్లూసీ భేటీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss), బీజేపీలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు సర్ధార్ పటేల్ వారసత్వాన్ని ఆక్రమించుకుంటున్నాయని ఆరోపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం లేని వ్యక్తులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూలు ఇద్దరూ ఒకరికొకరు వ్యతిరేకులుగా చూపించడానికి ప్రయత్నించారని తెలిపారు. పటేల్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
మహాత్మా గాంధీతో సంబంధం ఉన్న వారణాసిలోని సర్వ సేవా సంఘ్, గుజరాత్ విద్యాపీఠ్ వంటి సంస్థలను బీజేపీ, సంఘ్ పరివార్‌లు స్వాధీనం చేసుకుని గాంధీ వ్యతిరేకులకు అప్పగిస్తున్నాయని విమర్శించారు. గాంధీజీ సైద్ధాంతిక వారసత్వమే నిజమైన మూలధనం, దానిని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. పటేల్ భావజాలం ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు విరుద్ధమని, కానీ ఆ సంస్థలోని కొందరు వ్యక్తులు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తమదిగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు పటేల్ ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది జాతీయ నాయకులపై పక్కా ప్రణాళికతో కుట్ర జరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించడం ద్వారా ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సైతం హాజరయ్యారు.