‘ఉద్యోగుల వేతనాల ఆలస్యానికి చంద్రబాబే కారణం’

by srinivas |
‘ఉద్యోగుల వేతనాల ఆలస్యానికి చంద్రబాబే కారణం’
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్న చంద్రబాబు ఉద్యోగులను వేధిస్తున్నాడని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదని, ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు మోకాలడ్డాడు అంతే. ఈ బిల్లుకు మండలి ఆమోదం అవసరంలేదు. మరో మూడ్రోజుల్లో ఉద్యోగుల వేతనాల సమస్య తొలగిపోతుంది’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed