- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీజీ దివాలా తీశాం.. సాయం కావాలి: మిథున్ రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యలతో పాటు ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడంతో ఖజానా ఖాళీ అయిందని, ఆదుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో… ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పేదలకు ఆర్థిక సాయం కారణంగా రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడిందని తెలిపారు. ఈ పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్‌ది మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించాలని ఆయన ప్రధానిని కోరారు. పరిశ్రమలు, వ్యాపారాల రుణాల రికవరీని ఏడాది పాటు వాయిదా వేయాలని సూచించారు. ద్రవ్యలోటును అధిగమించేందుకు ఆర్బీఐతో కలిసి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు.
Tags: ap mp, ysrcp, letter to mp, mithun reddy, narendra modi