వైఎస్ఆర్ సీపీకి షాక్.. సీనియర్ నేత మృతి

by srinivas |
Gunnam Nagireddy
X

దిశ, హుజూర్‌నగర్ : వైఎస్సార్సీపీ సీనియర్ నేత గున్నం నాగిరెడ్డి (81) మంగళవారం ఉదయం మృతిచెందాడు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం చింతలపాలెం మండలంలోని దొండపహాడు.

YSR Nagireddy

నాగిరెడ్డి గతంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పని చేసి రిటైర్ మెంట్ అయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితునిగా ఉన్నారు. వైయస్ మృతి తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ వైఎస్సార్ సీపీలో కీలక నేతగా ఎదిగారు. ఆ పార్టీ తరపున మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు ఇన్ చార్జీగా పనిచేశారు. 2014 సంవత్సరం పార్లమెంటు ఎన్నికలలో వైయస్సార్సీపీ నుండి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. అప్పటినుండి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ఎక్సైజ్ డిపార్ట్ మెంటులో అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు ఇవ్వడంతో అక్కడే ఉండి పని చేశారు.

ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పెట్టే పార్టీలో ఆమె వెంట ఉండి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆ పదవికి రాజీనామా చేసినట్లు సన్నిహితుల ద్వారా సమాచారం. కాగా, ఆయన అంత్యక్రియలు దొండపహడులో నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed