దళిత సాధికారత ఏమో కానీ.. వారిపై దాడుల్లో అభివృద్ధి సాధించారు

by Ramesh Goud |
YS Sharmila Twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో వారి బతుకుల్లో అభివృద్ధిని తీసుకొస్తారో లేదో కానీ.. తెలంగాణ సర్కార్ ఏడేండ్ల పాలనలో వారిపై జరిగిన దాడుల్లో మాత్రం అభివృద్ధి సాధించారని వైఎస్సార్ టీపీ అధినేత్రి శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. 2014 లో దళితులపై 287 దాడులు జరిగితే ఏడేండ్లలో 826 శాతం పెరిగి 8,818 కేసులు నమోదయ్యాయని ఆమె పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో దాడులే కాక దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారులకు కూడా అవమానాలే జరిగాయన్నారు. సీఎంఓలో కనీసం ఒక్క దళిత ఆఫీసర్ లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. ప్రాధాన్యతలేని శాఖలకు వారిని నియమిస్తారని షర్మిల ఆరోపించారు. దళితులకు సీఎం ఇస్తున్న గౌరవాన్ని చూసే ఐఏఎస్ అధికారులు సంతోశ్, ఆకునూరి మురళి, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్వీస్ ఉన్నా కొలువులకు రాజీనామా చేశారని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed