- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ షర్మిలకు షాకిచ్చిన పోలీసులు.. రాత్రికి రాత్రే తరలింపు
దిశ, ఎల్బీనగర్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి లోటస్ పాండ్‌కు తరలించారు. దీక్షను భగ్నం చేస్తున్న క్రమంలో వైయస్ షర్మిల అనుచరులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయినా ఆమెను అరెస్ట్ చేసి దీక్షా స్థలి నుంచి లోటస్ పాండ్‌కు తరలించారు. తిరిగి లోటస్ పాండ్ నుంచి దీక్షా స్థలికి చేరుకునేందుకు షర్మిల ప్రయత్నించడంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లోటస్ పాండ్‌లోనే షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన ఘటనలో సీఎం కేసీఆర్ న్యాయం అందించకపోవడాన్ని నిరసిస్తూ ఆమె ఘటనా స్థలి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం..
చిన్నారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు పోరాడుతామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలోని చిన్నారి కుటుంబాన్ని బుధవారం రాత్రి ఆమె పరామర్శించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.