అసోం సీఎంతో జగన్ ఫోన్‌లో మాటామంతీ..!

by srinivas |
అసోం సీఎంతో జగన్ ఫోన్‌లో మాటామంతీ..!
X

అసోం సీఎం శర్బానంద సోనోవాల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అసోంకి చేపలు భారీ ఎత్తున దిగుమతి అవుతాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ మత్స్యపరిశ్రమ నష్టాల్లో కూరుకుపోకుండా ఉండేందుకు సీఎం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి ఎగుమతైన చేపలు అసోం సరిహద్దుల్లో లారీల్లో నిలిచిపోయాయి.

లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన లాక్‌డౌన్ ఊహించని విధంగా ఆరు వారాల పొడిగించబడింది. ఇంకా ఇదెంత కాలం కొనసాగుతుందో కూడా అంచనాలకు అందడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌కు ఫోన్ చేసి, సరిహద్దుల్లో నిలిచిన లారీలకు అనుమతినివ్వాలని సూచించారు.

కేవలం లారీలకు అనుమతితో సరిపెట్టకుండా చేపలమ్మే మార్కెట్లను కూడా తెరిపించాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని ఆయన జగన్‌ను కోరారు. వారికి అన్ని రకాలుగా సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags: ap cm, ys jagan, ap, ysrcp, assam cm, assam, sarbananda sonowal

Advertisement

Next Story

Most Viewed