- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెర్సిడెస్ కారును కాల్చేసిన యూట్యూబర్
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో చాలామంది వింత వింత స్టంట్స్‌తో కూడిన వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే వాటిలో కొన్ని వీడియోలను ఎందుకు చేస్తారో కూడా తెలియకపోగా.. కొన్నింటికీ అర్థమే ఉండదు. అలా ఓ రష్యన్ యూట్యూబర్.. ఏకంగా రూ. 70-80 లక్షల విలువ చేసే మెర్సిడెస్ కారును కాల్చేశాడు. అయితే అతడు అర్థం లేకుండా చేసిన పని కాదు ఇది. ఫ్రస్టేషన్‌తో చేశాడు. ఇంతకీ ఏమైంది? అతని ఫ్రస్టేషన్‌కు కారణమేంటి?
రష్యాకు చెందిన మిషా అలియాస్ మైఖేల్ లిట్విన్ యూట్యూబర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తనను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు కూడా. ఇటీవలే మెర్సిడెస్ ఏఎమ్‌జీ జీటీ63 కారును కొనుగోలు చేశాడు. అయితే తాను ఇష్టపడి కొనుక్కున్న మెర్సిడెస్ కారులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో లిట్విన్ లోకల్ మెర్సిడెస్ డీలర్ వద్దకు రిపేర్‌కు తీసుకెళ్లాడు. అలా ఒక్కసారి కాదు.. ఐదు సార్లు రిపేర్‌కు తీసుకెళ్లినా.. ఆ డీలర్ రిపేర్ చేయకుండా తిరస్కరించడంతో ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. దీంతో ఆ కారు లోపల, బయటనే కాకుండా కారుకు కొంచెం దూరంలో.. ఓ దారిలా చేసి అక్కడున్న గడ్డిపై కూడా గ్యాసోలిన్ పోసి నిప్పంటించేశాడు. క్షణాల్లో ఖరీదైన కారు మంటల్లో కాలిపోయింది. తాను చేసిన ఈ పనిని మొత్తం వీడియోగా తీసిన లిట్విన్.. తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో.. 10 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు.
కారును కాల్చేశాడు.. కానీ తన వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం వాటితోనే మరో కొత్త కారు కొనుక్కోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇండియాలో అయితే మెర్సిడెస్ బెంజ్ జీటీ 63 ఎస్ 4 మాటిక్ ప్లస్ 4 డోర్ కోప్ ఎక్స్ షోరూమ్ ధరనే 2.4 కోట్లు ఉంది. బెంజ్ కంపెనీ ఖరీదైన కార్ మోడల్స్‌లో ఇది కూడా ఒకటి.