ఎత్తిన బాటిల్ దించకుండా వోడ్కా తాగి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

by vinod kumar |   ( Updated:2021-02-06 01:16:00.0  )
ఎత్తిన బాటిల్ దించకుండా వోడ్కా తాగి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఓ 60 ఏళ్ల వృద్ధుడు యూట్యూబ్ వీడియో కోసం తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఇండిపెండెంట్ కథనం ప్రకారం ‘గ్రాండ్ ఫాదర్’గా రష్యన్లకు సుపరిచితుడైన ”యూరి డ్యూషే చకిం” ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో ఏదో ఒక ఛాలెంజ్ చేస్తూ సబ్ స్కైబర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎప్పటిలాగే యూట్యూబర్ డ్యూషే కొత్త ఛాలెంజ్ అంటూ తన సబ్ స్కైబర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ లో యూట్యూబర్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తుంటే లైవ్ లో చూస్తున్నవారు మనీని ఎక్సేంజ్ చేసుకోవచ్చని ఊరించాడు. దీంతో ఈ ఆఫర్ నెటిజన్లకు నచ్చడంతో లైవ్ లో ఈ గాడ్ ఫాదర్ ఏం చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. వేల సంఖ్యలో లైవ్ స్ట్రీమ్ లో డ్యూషే ఛానెల్ ను వీక్షిస్తుండగా ఛాలెంజ్ లో భాగంగా 1.5లీటర్ల వోడ్కా బాటిల్ ను ఎత్తింది దించకుండా తాగేస్తానని చెప్పాడు. దీంతో పలువురు ఈఛాలెంజ్ ను వద్దని వారిస్తే మరికొందరు ఎగ్జైట్మెంట్గా ఉంది త్వరగా చేయండి అంటూ సపోర్ట్ చేశారు. దీంతో రెచ్చిపోయిన యూట్యూబర్ 1.5లీటర్ల వోడ్కా బాటిల్ దించకుండా గడగడా తాగేశాడు.అనంతరం టాస్క్ కంప్లీట్ చేసుకొని కుర్చీలో కూర్చున్న యూట్యూబర్ డ్యూషే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లైవ్ లో ఏం జరుగుతుందో అర్ధంకాక అభిమానులు ఆందోళనకు గురుయ్యాయి. డ్యూషే కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తన స్నేహితులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వోడ్కా తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని గుర్తించారు. యూట్యూబర్ మరణంపై రష్య సెనేటర్ అలెక్సీ స్పందించారు. ఇలాంటి ఛాలెంజ్ లను ఇకపై జరగనివ్వబోమని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed