అపార్ట్‌మెంట్ పై నుంచి కిందపడిన యువతి.. దగ్గరకు వెళ్లి షాకైన స్థానికులు

by Sumithra |   ( Updated:2021-12-21 22:19:29.0  )
Woman-Suicide1
X

దిశ, వెబ్ డెస్క్: అపార్ట్ మెంట్ పై నుంచి నగ్నంగా కిందపడిన యువతికి తీవ్ర గాయాలైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతికి యూపీలోని నోయిడాలో నివసించే ఓ వ్యక్తి పరిచయం. అయితే, అతడిని కలిసేందుకు నోయిడాకు వచ్చింది. ఆరోజు రాత్రి సమయంలో అపార్ట్ మెంట్ నుంచి ఒక్కసారిగా కిందపడింది. పెద్ద శబ్ధం రావడంతో ఏమైందో అని చూసేందుకు స్థానికులు అక్కిడికి పరుగులు పెట్టారు. అయితే, ఆ సమయంలో యువతి తీవ్ర గాయాలతో నగ్నంగా ఉన్నట్లుగా వారు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తీవ్ర గాయాలైన ఆ యువతి ప్రస్తుతం చికిత్స పొందుతున్నదని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె నుంచి వివరాలు సేకరిస్తామని పోలీసులు చెప్పారు. అదేవిధంగా ఆమె స్నేహితుడిని కూడా విచారించగా ఆ యువతి అప్పుడప్పుడు అతడిని కలిసేందుకు వస్తూ ఉంటుందని, ఆరోజు నైట్ వాళ్లిద్దరు కలిసి పార్టీ చేసుకున్నారని, మద్యం మత్తులో ఆమె కిటికీ నుంచి కిందపడి ఉంటుందని అతను చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story