నాన్నా.. నన్ను క్షమించు… నేను వెళ్లిపోతున్నా

by Anukaran |
నాన్నా.. నన్ను క్షమించు… నేను వెళ్లిపోతున్నా
X

దిశ, వెబ్ డెస్క్: ఎంతో ఇష్టపడి.. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించినవాడితో జీవితాన్ని ఊహించుకుంటూ గాలిలోనే మేడలు కట్టేసుకుంది. కానీ పెళ్లి తర్వాత ప్రేమించిన వాడి అసలు రూపం బయట పడేసరికి తట్టుకోలేక పోయింది. పెద్దలను ఎదిరించి బయటికి వచ్చి మోసపోయిన తనకు చావే పరిష్కారమనుకుంది. మోసపోయాయన్న బాధను తట్టుకోలేక హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది ఒక యువతీ విషాధ గాధ.

సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య ( 20) బంజార హిల్స్ రోడ్ నంబర్ 5లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అషీర్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. కొద్ది రోజులోనే ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇటీవలే గుడిలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం నరకప్రాయంగా మారింది. పెళ్లి తర్వాత నుండి ఆషీర్ ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. దీంతో ఐశ్వర్య తల్లిదండ్రులు ఆషీర్ ని ముందు సెటిల్ అవ్వమని చెప్పి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే తల్లిదండ్రులు తనను, ఆషీర్ నుండి దూరం చేస్తారేమోనన్న భయంతో ఐశ్వర్య ఇంట్లో ఎవరికి తెలియకుండా పారిపోయి మళ్ళీ ప్రేమించినవాడు దగ్గరకు చేరింది. త్వరలోనే ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఐశ్వర్యను లోబర్చుకున్నాడు ఆషీర్. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. అప్పుడే పిల్లలు వద్దు అంటూ ఆమెకు అబార్షన్ చేయించడంతో ఐశ్వర్యకు అనుమానం వచ్చింది. ఆషీర్ ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీసింది. దాంతో తల్లితో మాట్లాడి చెబుతానంటూ ఇంటికి వెళ్లిన ఆషీర్‌ ముఖం చాటేశాడు.

దీంతో మోసపోయానని గ్రహించిన ఐశ్వర్య.. తానూ ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతకు ముందు తండ్రి, అన్నకు వాట్స్ అప్ మెసేజ్ లు పెట్టింది. నాన్న.. నన్ను క్షమించండి.. మిమ్మల్ని కాదని వీడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకున్న. కానీ నేను మోసపోయాను. నన్ను మోసం చేశాడు. ఈ మోసాన్ని భరించలేకపోతున్న. అందుకే మీ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్లిపోతున్న’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story